Sun Apr 13 2025 23:23:03 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనవడి హత్య
జనవరి 7 శనివారం రాత్రి.. మహువార్ గ్రామంలో ఉన్న 35 ఏళ్ల హిమాన్షు సింగ్ ను కొందరు వ్యక్తులు అతి దారుణంగా కొట్టారు. తీవ్ర..

నేరాలకు నెలవైన ఉత్తరప్రదేశ్ లో మరో దారుణ ఘటన జరిగింది. దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేదార్ సింగ్ మవవడిని కొందరు వ్యక్తులు కొట్టిచంపారు. మవు జిల్లాలోని కోపాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జనవరి 7 శనివారం రాత్రి.. మహువార్ గ్రామంలో ఉన్న 35 ఏళ్ల హిమాన్షు సింగ్ ను కొందరు వ్యక్తులు అతి దారుణంగా కొట్టారు. తీవ్రగాయాలు కావడంతో హిమాన్షు మరణించాడు. పాతకక్షల నేపథ్యంలోనే హిమాన్షును హత్య చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు.
శనివారం రాత్రి కోపాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైరో డోన్వార్ గ్రామంలో పంచాయతీకి హిమాన్షు వెళ్లగా.. అక్కడ కొంతమంది వ్యక్తులతో వాగ్వివాదం జరిగింది. దీంతో వారంతా కలిసి కర్రలతో ఆయనను చావబాదారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను మహువార్ గ్రామంలో పడేశారు. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి వెళ్లి హిమాన్షు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. హిమాన్షు తాత దివంగత కేదార్ సింగ్ 1980లో ఘోసి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Next Story