Fri Nov 22 2024 19:08:46 GMT+0000 (Coordinated Universal Time)
హర్యానా మాజీమంత్రి కుమారుడి ఆత్మహత్య
ఆస్తి సంబంధ విషయంలో జగదీశ్ ను కొందరు వేధించారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని జగదీశ్ కూడా..
హర్యానా మాజీమంత్రి మాంగేరామ్ రాఠీ తనయుడు జగదీశ్ రాఠీ (55) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనవరి 11 బుధవారం సాయంత్రం జగదీశ్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఝజ్జర్ ఎస్పీ వసీమ్ అక్రం తెలిపారు. జగదీశ్ ఆత్మహత్య కేసులో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్ డీ) రాష్ట్ర అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ సహా ఆరుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకూ ఆయన మరణానికి కారణం విషం తీసుకోవడమేనని భావిస్తున్నామన్నారు.
ఆస్తి సంబంధ విషయంలో జగదీశ్ ను కొందరు వేధించారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని జగదీశ్ కూడా ఇటీవల ఓ ఆడియో క్లిప్ ద్వారా వెల్లడించారు. డిసెంబరు 26న జగదీశ్ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేస్తూ వీరందరూ తనను వేధిస్తున్నారని, తనకేమైనా జరిగితే అందుకు వారే బాధ్యులు అవుతారని అందులో ఆరోపించారు. దీంతో పోలీసులు ఆయనను కలిసి ఫిర్యాదు చేయాలని కోరగా, అందుకు జగదీశ్ నిరాకరించారు. జగదీశ్ పోస్టుమార్టమ్ రిపోర్టు రావలసి ఉందన్నారు.
Next Story