Wed Dec 18 2024 15:50:28 GMT+0000 (Coordinated Universal Time)
ఊబర్ కు భారీ కన్నంవేసిన మాజీ ఉద్యోగి.. రూ.1.17కోట్ల లూటీ
ఉద్యోగం చేస్తున్న సమయంలోనే నకిలీ డ్రైవర్ల ఖాతాలను స్ప్రెడ్ షీట్ లో నమోదు చేశాడు. ఊబర్ స్పెడ్ షీట్ ఆధారంగానే డ్రైవర్లకు..
ఊబర్ సంస్థలో కేవలం 5 నెలలపాటు పనిచేసి వెళ్లిపోయిన మాజీ ఉద్యోగి సంస్థకు భారీగా కన్నం వేశాడు. నకిలీ అకౌంట్ తో ఏకంగా రూ.1.17 కోట్ల మేర మోసం చేశాడు. విషయం తెలుసుకున్న ఊబర్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. సదరు వ్యక్తి 2021 ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు కాంట్రాక్టర్ గా పనిచేశాడు. ఊబర్ ప్లాట్ ఫామ్ కింద నమోదైన డ్రైవర్లకు చెల్లింపుల వ్యవహారాలు అతనే చూసేవాడు. డ్రైవర్ల వివరాలను అప్డేట్ చేసేవాడు.
ఉద్యోగం చేస్తున్న సమయంలోనే నకిలీ డ్రైవర్ల ఖాతాలను స్ప్రెడ్ షీట్ లో నమోదు చేశాడు. ఊబర్ స్పెడ్ షీట్ ఆధారంగానే డ్రైవర్లకు చెల్లింపులు చేస్తుంటుంది. అయితే సదరు మాజీ ఉద్యోగి.. ఈ స్ప్రెడ్ షీట్ లో నకిలీ డ్రైవర్ల ఖాతాలను సృష్టించడంతో వారికి కూడా చెల్లింపులు జరిగాయి. మొత్తం 388 నకిలీ ఖాతాలను సృష్టించినట్లు ఊబర్ గుర్తించింది. ఐదు నెలలపాటు పనిచేసిన ఉద్యోగి కంప్యూటర్ నుండే.. 191 నకిలీ ఖాతాలను చేర్చినట్టు తెలిసింది. మొత్తం మీద 388 నకిలీ ఖాతాలకు సంబంధించి 18 బ్యాంకు ఖాతాలకు రూ.1,17,03,033 చెల్లింపులు జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఊబర్ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.
Next Story