Mon Dec 23 2024 06:40:02 GMT+0000 (Coordinated Universal Time)
షాకింగ్ ట్రూత్ :విశాఖ అగ్నిప్రమాదం కారణాలు ఉప్పుచేప కోసం.. కోట్లు తగలపెట్టారు
విశాఖలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు నలభై బోట్లు ఆహుతై వందల కోట్ల ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే
ఎవరైనా చుట్ట కాల్చుకునేందుకు ఇంటికి నిప్పు పెట్టుకుంటారా? అలాగే ఉంది. విశాఖలోని కొందరు యువకులు. ఉప్పు చేప తినేందుకు కోట్లు తగల పెట్టారు. ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదానికి కారణాలు ఒక్కొక్కటీ నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు నలభై బోట్లు ఆహుతై వందల కోట్ల ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. మత్స్యకారులకు సంబంధించిన నలభై బోట్ల వరకూ అగ్నికి ఆహుతయ్యాయి. ఉపాధికి కూడా గండి పడింది.
మద్యం తాగుతూ...
దీనికి కారణం ఒక ఉప్పు చేప అని పోలీసుల విచారణలో తేలింది. ఫిషింగ్ హార్బర్ లో మద్యం తాగుతూ మంచింగ్ కోసం ఉప్పు చేపను తినాలనుకున్నారు. అంతే బోటులో ఉన్న గ్యాస్ సిలిండర్ ను ఆన్ చేసి ఉప్పు చేపను ఫ్రై వేయించుకోవడానికి ఆ యువకులు ఇద్దరు చేసిన ప్రయత్నం చివరకు బోట్లన్నీ తగలబడటానికి కారణమయింది. సీసీటీవీ ఫుటేేజీలను పరిశీలించిన పోలీసులు ఈ ప్రమాదంపై ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
సీసీ టీవీ ఫుటేజీలో...
బోటులో మద్యం తాగుతున్న యూట్యూబర్ నాని, అతని మేనమామ సత్యంలకు ఉప్పు చేప తినాలనిపించింది. మందులోకి ఉప్ప చేప ఉంటే బాగుంటుందని భావించి పక్కనే ఉన్నచేపను మద్యం మత్తులో ఫ్రై చేసుకున్నారు. దీంతో మంటలు చెలరేగి వరసగా నిలబెట్టిన బోట్లన్నీ దగ్దమయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 40 బోట్లు పూర్తిగా దగ్దం కాగా, 9 బోట్లు పాక్షికంగా దగ్దమయ్యాయి. ప్రభుత్వం ఒక్కొక్క బోటుకు ఎనభై శాతం పరిహారాన్ని కూడా అందించింది. దీనికి కారణమైన నాని, అతని మేనమామ సత్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Next Story