Mon Dec 23 2024 05:43:28 GMT+0000 (Coordinated Universal Time)
పిఠాపురంలో నలుగురు బాలికలు అదృశ్యం
అదృశ్యమైన బాలికల ప్రవర్తన బాలేదంటూ పాఠశాలలో ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే మందలించారు. ఉపాధ్యాయులు
పిఠాపురం : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 10వ తరగతి చదువుతున్న నలుగురు బాలికలు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. అదృశ్యమైన నలుగురు బాలికల్లో ఇద్దరు బాలికల కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. మార్చి 30వ తేదీన పాఠశాలకు వెళ్లిన ఓ బాలిక సాయంత్రానికి ఇంటికి రాలేదు. ఏప్రిల్ 2.. నిన్న తెల్లవారుజామున మరో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు.
అదృశ్యమైన బాలికల ప్రవర్తన బాలేదంటూ పాఠశాలలో ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే మందలించారు. ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపం చెందిన బాలికలు ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. నలుగురు బాలికలు కలిసి హైదరాబాద్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story