Mon Dec 23 2024 12:06:12 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. ఈతకెళ్లి నలుగురు చిన్నారులు మృతి
ఆదివారం మధ్యాహ్న సమయంలో ముగ్గురు బాలురు, ఒక అమ్మాయి బంధువులతో కలిసి గొల్లగూడలోని దర్గాకు వెళ్లారు.
చిన్నారుల ఈత సరదా రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు రావడంతో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలు గ్రామంలోని చెరువులో ఈతకెళ్లారు. అటునుంచి అటే కానరాని లోకానికి వెళ్లిపోయారు. మృతులు సమరిన్ (14), ఖలేదు (12), రెహాన(10), ఇమ్రాన్(9) లుగా గుర్తించారు.
ఆదివారం మధ్యాహ్న సమయంలో ముగ్గురు బాలురు, ఒక అమ్మాయి బంధువులతో కలిసి గొల్లగూడలోని దర్గాకు వెళ్లారు. ప్రార్థన అయ్యాక నలుగురు పిల్లలు గొల్లగూడ రెవెన్యూ పరిధిలోని ఎర్రకుంట ట్యాంక్ ను సందర్శించి మార్గమధ్యంలో కనిపించిన చెరువులోకి ఈత కొట్టేందుకు దిగారు. చెరువు లోతు ఎక్కువగా ఉండటంతో.. నలుగురూ చెరువులో మునిగిపోయారు. కొద్దిసేపటికి చెరువులో చిన్నారులు మునిగిపోయిన విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి వారి కుటుంబాలకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చెరువులో నుంచి చిన్నారుల మృతదేహాలను వెలికి తీసి ఓజీహెచ్ కి తరలించారు. ఒకేసారి నలుగురు చిన్నారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.
Next Story