Mon Dec 23 2024 12:02:54 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో బాంబు పేలుడు
తమిళనాడులో బాంబు పేలిన ఘటనలో నలుగురు మరణించారు. ఈ ఘటన నామక్కల్ జిల్లాలోని మోగనూరులో జరిగింది
తమిళనాడులో బాంబు పేలిన ఘటనలో నలుగురు మరణించారు. ఈ ఘటన నామక్కల్ జిల్లాలోని మోగనూరులో జరిగింది. ఒక ఇంట్లో నాటు బాంబులు తయారీ చేస్తుండగా అర్థరాత్రి సమయంలో పేలడంతో చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించడంతో మోగనూరులో విషాదం అలుముకుంది.
ఆరుగురి పరిస్థితి విషమం...
పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమయింది. ఇంట్లో పేలుడు పదార్థాలు తయారు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Next Story