Mon Dec 23 2024 15:24:17 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో కిడ్నాప్ కలకలం
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం నుంచి నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈ కిడ్నాప్ జరిగింది
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం నుంచి నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈ కిడ్నాప్ జరిగింది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. జితేందర్ రెడ్డి డ్రైవర్ తో పాటు మరో ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ పై జితేందర్ రెడ్డి వ్యక్తిగత సహాయ సిబ్బంది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కారణాలు మాత్రం....
జితేందర్ రెడ్డి డ్రైవర్ తో పాటు మహబూబ్ నగర్ కు చెందిన మున్నూరు రవి తో పాటు మరో ఇద్దరు కిడ్నాప్ నకు గురయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కిడ్నాప్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్న దానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జితేందర్ రెడ్డి నివాసంలోని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Next Story