Mon Dec 23 2024 14:59:01 GMT+0000 (Coordinated Universal Time)
మంగళగిరిలో విద్యార్థులు అదృశ్యం.. ఏం జరిగింది ?
గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ విషయం స్థానికంగా కలకం రేపుతోంది.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ విషయం స్థానికంగా కలకం రేపుతోంది. పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం చెప్పిన వివరాల మేరకు.. రాజీవ్ గృహ కల్పకు చెందిన నలుగురు విద్యార్థులు వెంకటేశ్, ప్రభుదేవ, సంతోష్ లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. వెంకటేశ్ అనే మరో విద్యార్థి ఎర్రబాలెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం కూడా స్కూల్ కు వెళ్లారు వీరంతా.
పేరెంట్స్ ను తీసుకు రావాలని...
వీరిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు క్లాస్ రూమ్ లో పుస్తకాల బ్యాగులను పెట్టి బయటికి వెళ్లిపోయారు. సాయంత్రం స్కూల్ విడిచిపెట్టాక వచ్చి బ్యాగులు తీసుకుని వెళ్తుండగా.. ఉపాధ్యాయులు గమనించి వారిని అడ్డుకున్నారు. స్కూల్ కి రాకుండా ఎక్కడ తిరుగుతున్నారని ప్రశ్నించి, మంగళవారం ఉదయం స్కూల్ కి వచ్చేటపుడు తల్లిదండ్రులను కూడా తీసుకుని రావాలని చెప్పారు.
భయపడిన వారంతా....
దీంతో ఇంట్లో తాము స్కూల్ కి వెళ్లలేదని తెలిస్తే మందలిస్తారని భయపడిన విద్యార్థులు.. ఎర్రబాలెంలోని పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థి వెంకటేశ్తో కలిసి సాయంత్రం 7 గంటల సమయంలో వారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని, విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story