Sun Dec 22 2024 20:57:30 GMT+0000 (Coordinated Universal Time)
గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు
కాకినాడ జిల్లాలో నలుగురు యువకులు గోదావరిలో
కాకినాడ జిల్లాలో నలుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన జరిగింది. తణుకు పరిధిలోని సజ్జాపురంకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చారు. యానాం విహార యాత్రకు వచ్చిన స్టూడెంట్స్.. విహార యాత్ర ముగించుకొని వెళ్తూ వెళ్తూ.. గోదావరిలోకి యువకులు దిగారు. స్నానానికి నదిలో దిగగా నది ప్రవాహానికి నలుగురు గల్లంతు అయ్యారని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గల్లంతైన నలుగురు తణుకు కి చెందిన విద్యార్థులు రవితేజ,(20) , బాలాజీ(21) , కార్తీక్(21) , గణేష్(22) లుగా గుర్తించారు. చీకటి కావడంతో గాలింపు చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సంఘటన ప్రాంతానికి కోరంగి పోలీసులు చేరుకున్నారు.
Next Story