Mon Dec 23 2024 11:31:28 GMT+0000 (Coordinated Universal Time)
యువతిపై గ్యాంగ్ రేప్ .. ప్రొఫెషనల్ స్విమ్మర్స్ అరెస్ట్
రోజూ ఛాటింగ్ చేసుకున్న వారిద్దరూ.. కొంతకాలానికి ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. మార్చి 24వ తేదీన తన ఇంట్లో పార్టీ ఉందని,
బెంగళూరు : బెంగళూరులో నర్సుగా ఉద్యోగం చేస్తోన్న యువతి(22) పై ఢిల్లీకి చెందిన నలుగురు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాధిత యువతి ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తూ.. తన స్నేహితులతో కలిసి నివాసముంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమెకు..గత వారం డేటింగ్ యాప్ లో జాతీయ స్థాయి స్విమ్మింగ్ లో గుర్తింపు తెచ్చుకున్న రజత్ అనే యువకుడితో పరిచయం అయింది.
రోజూ ఛాటింగ్ చేసుకున్న వారిద్దరూ.. రెండు, మూడు రోజుల్లోనే ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. మార్చి 24వ తేదీన తన ఇంట్లో పార్టీ ఉందని, రావాలని యువతిని ఆహ్వానించాడు. అతని ఆహ్వానం మేరకు పార్టీకి వెళ్లింది యువతి. ఆ రాత్రి రజత్, అతని ముగ్గురు ఫ్రెండ్స్, యువతి కలిసి మందుపార్టీ చేసుకున్నారు. రాత్రికి ఆమె అతని రూమ్ లోనే ఉండిపోయింది. అర్థరాత్రి తర్వాత.. తనపై రజత్ సహా అతని స్నేహితులైన శివరాజ్, దేవ్ సరోయి, యోగేష్ కుమార్ అత్యాచారం చేశారంటూ ఆ యువతి సంజయ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించారు. యువతిపై లైంగిక వేధింపులు, అత్యాచారం జరిగిందని నిర్థారణ అయిన అనంతరం.. పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. స్విమ్మింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నలుగురు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ రేప్ కేసులో అరెస్ట్ కావడం.. కలకలం రేపింది.
Next Story