Mon Dec 23 2024 02:42:02 GMT+0000 (Coordinated Universal Time)
200 కోట్లతో పరారీ.. నిందితుడి కోసం గాలింపు
హైదరాబాద్ లో మరో భారీ మోసం జరిగింది. డిపాజిట్ల పేరుతో వందలాది మంది వద్ద కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి పరారీ అయ్యాడు
హైదరాబాద్ లో మరో భారీ మోసం జరిగింది. డిపాజిట్ల పేరుతో వందలాది మంది వద్ద కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి పరారీ అయ్యాడు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ కింద రావులకొల్లు రమేష్ అనే వ్యక్తి ఎఎస్ రావు నగర్ లో ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థను ప్రారంభించారు. తానే మిషన్లు ఇచ్చి, తయారయిన తర్వాత వస్తువులను తానే కొనుగోలు చేస్తానని ప్రజలను నమ్మించాడు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు పెద్దయెత్తున రమేష్ వద్ద డిపాజెట్లు పెట్టారు.
వత్తుల తయారీ అంటూ...
తొలిరోజులలో బాగానే తయారయిన వత్తులు, బొట్టు బిళ్లలకు డబ్బులు ఇచ్చాడు రమేష్. వత్తులు తాను ఇచ్చిన మిషన్ తో తయారు చేసి ఇస్తే కిలోకు మూడు వందలు ఇస్తానని చెప్పి ఆ విధంగా చెల్లించాడు. దీంతో నమ్మకం కుదరడంతో అనేక మంది వత్తుల తయారీ మిషన్లు రమేష్ వద్ద నుంచి కొనుగోలు చేశాడు. ఒక్కొక్క మిషన్ ను 1.20 లక్షల నుంచి 2.60 లక్షల వరకూ వసూలు చేశాడు. అయితే మూడు నెలల నుంచి వత్తులు తయారీ చేసి ఇస్తున్నా డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. డిపాజిట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు నిలదీయడంతో రమేష్ పరారయ్యాడు. రమేష్ వసూలు చేసిన డబ్బులు 200 కోట్లు ఉంటుందని అంచనా. పోలీసులు రమేష్ కోసం గాలిస్తున్నారు.
Next Story