Mon Dec 23 2024 04:15:32 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్ మార్కెట్ లో ఫ్రిడ్జ్.. చూస్తుండగానే చిన్నారి ప్రాణాలు
చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ఓ చిన్నారి ప్రాణాలు పోగొట్టుకుంది
చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ఓ చిన్నారి ప్రాణాలు పోగొట్టుకుంది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని నంది పేటలో ఉన్న నవీ పేట్ లో నివాసముంటున్న రాజశేఖర్ అనే వ్యక్తి తన కూతురు రుషిత (4)ను తీసుకొని సూపర్ మార్కెట్ కు వెళ్లాడు. అక్కడ ఫ్రిడ్జ్ లో చాక్లెట్లు చూసిన రుషిత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చాక్లెట్లు తీసుకో వాలని భావించింది. రుషిత చాక్లెట్ల కోసం ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగా ఒక్కసారి గా కరెంట్ షాక్ తగిలి అలాగే ఫ్రిడ్జ్ కు వేలాడుతూ ఉండిపోయింది. ఆ పక్కనే ఫ్రిడ్జ్ లో ఉన్న సామాన్లు తీసుకుంటున్న తండ్రి అది గమనించి వెంటనే పాపను స్థానిక హాస్పిటల్ కి తరలించాడు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు గా వైద్యులు ధ్రువీకరించారు.
తండ్రి రాజశేఖర్ సూపర్ మార్కెట్ లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వస్తువులు తీసుకోడానికి చూస్తుండగా, చిన్నారి పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో డోర్ షాక్ కొట్టి చిన్నారి రుషిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఊహించని విధంగా రుషిత ప్రాణాలు పోవడాన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Next Story