Mon Dec 23 2024 05:57:09 GMT+0000 (Coordinated Universal Time)
మరో యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్న పబ్జీ !
గేమ్ ఆడినంత సేపు గొడవ పడేవారు. ఈ క్రమంలో రోజూ లాగే పబ్జీ ఆడుతున్న ఆ నలుగురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ..
థానే : కరోనా కారణంగా.. యువత అంతా స్మార్ట్ ఫోన్లకు, వాటిలో ఉన్న గేమ్ లకు బాగా అలవాటు పడిపోయారు. తిండిలేకపోయినా ఉంటారేమో గానీ.. ఫోన్లు, గేమ్స్ లేకపోతే ఉండలేని పరిస్థితి. పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలా గేమ్ ఏదైనా సరే.. అవి కొన్ని కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని, నష్టాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా పబ్జీ మరో యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. మహారాష్ట్రలోని థానేలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. థానే లోని వర్తక్ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు తరచూ ఆన్ లైన్ గేమ్ అయిన పబ్జీ ఆడుతుంటారు.
Also Read : రామారావు ఆన్ డ్యూటీ టీజర్ అదిరిందిగా !
గేమ్ ఆడినంత సేపు గొడవ పడేవారు. ఈ క్రమంలో రోజూ లాగే పబ్జీ ఆడుతున్న ఆ నలుగురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. ఆ గొడవ కాస్తా పెద్దదవ్వడంతో.. మత్తులో విచక్షణ కోల్పోయిన ముగ్గురు యువకులు తమ స్నేహితుడిని పదునైన కత్తితో పొడిచారు. ఈ ఘటనలో బాధితులు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. హత్యకు పాల్పడిన ముగ్గురిలో ఒకరిని అరెస్టు చేశారు. ఇద్దరు మైనర్లు కావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Next Story