Mon Dec 23 2024 06:29:20 GMT+0000 (Coordinated Universal Time)
బైక్ పై వెళ్తున్న వివాహితను ఢీ కొట్టి.. అత్యాచారం
కిందపడిన ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేసి.. పరారయ్యారు. పొద్దుపోతున్నా ..
బైక్ పై వెళ్తున్న వివాహితను ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టిన దుండగులు.. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. బాధిత మహిళ ప్రతిరోజూ ద్విచక్రవాహనంపై ఒంగోలుకు వచ్చి కూరగాయలు అమ్ముకుని వెళ్తుంటుంది. ప్రతిరోజూలాగానే.. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఒంగోలులో పని ముగించుకుని తిరిగి ఇంటికి పయనమైంది. అదే సమయంలో పూటుగా మద్యం సేవించి ఉన్న ఇద్దరు వ్యక్తులు బైక్పై ఆమెను వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే కావాలనే ఆమె వాహనాన్ని ఢీ కొట్టారు
కిందపడిన ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేసి.. పరారయ్యారు. పొద్దుపోతున్నా మహిళ ఇంటికి చేరకపోవడంతో.. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లారు. దారిమధ్యలో బాధితురాలు కనిపించి, జరిగిన విషయాన్ని తెలిపింది. నిందితుల కోసం గాలించగా.. కొత్తపట్నం రోడ్డులోని ఓ పెట్రోలు బంకు వద్ద నిందితులు కనిపించారు. వారిని పట్టుకునే లోపే అక్కడి నుంచి పరారయ్యారు. మర్నాడు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్నారు.
ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొప్పోలు సమీపంలోని చేపల చెరువుల వద్ద కాపలాదారులుగా పనిచేస్తున్నఇద్దరు యువకులే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story