Mon Dec 23 2024 10:58:37 GMT+0000 (Coordinated Universal Time)
పాతబస్తీలో దారుణం.. మైనర్ పై రెండ్రోజులు సామూహిక అత్యాచారం
13 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఓయో లాడ్జికి..
ఆడపిల్లలు, యువతుల రక్షణకై ఎన్ని చర్యలు తీసుకున్నా.. గతంలో ఆడపిల్లలపై నేరాలకు పాల్పడిన వారిని ఎంత కఠినంగా శిక్షించినా కామాంధుల్లో మార్పురావట్లేదు. ఆడపిల్ల కనిపించడమే పాపంగా మారిందీ రోజుల్లో. ముక్కుపచ్చలారని పసిపిల్లల నుంచి వృద్ధ మహిళల వరకూ.. ఎవర్నీ వదలడం లేదు మృగాళ్లు. తాజాగా మరో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన హైదరాబాద్ లోని పాతబస్తీలో చోటుచేసుకుంది.
13 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఓయో లాడ్జికి తీసుకెళ్లారు. అనంతరం బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజులు బాలికను రూమ్ లోనే బంధించి.. తమ కామకోరికను తీర్చుకున్న దుండగులు..బాలికను రూమ్ లోనే వదిలి వెళ్లారు. జరిగిన విషయమంతా బాలిక తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story