Mon Dec 23 2024 12:14:02 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియుడి కళ్లెదుటే ప్రియురాలిపై అత్యాచారం..తట్టుకోలేక..
యువకుడిని చితకబాది.. అతని కళ్లెదుటే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమె మెడలోని నగలను దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనతో
అరుప్పుకోట : ప్రియురాలిపై తన కళ్లెదుటే అత్యాచారం చేశారు ముగ్గురు వ్యక్తులు. ఆ దారుణాన్ని చూసి తట్టుకోలేని ప్రియుడు ఆత్మహత్యకు యత్నించాడు. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా అరుప్పుకోటలో జరిగిందీ దారుణం. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అరుప్పుకోటకు చెందిన యువతి తన ప్రియుడితో కలిసి ఈనెల 23న బీచ్ కు వెళ్లింది. బీచ్ వద్ద కూర్చుని ప్రేమికులు ముచ్చట్లాడుకుంటుండగా.. ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు.
యువకుడిని చితకబాది.. అతని కళ్లెదుటే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమె మెడలోని నగలను దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధిత యువతి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్ పోలీసులు.. నిందితులు పద్మాశ్వరన్, దినేష్ కుమార్, అజిత్లను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. పోలీసులను గమనించిన నిందితులు వారిపై దాడిచేసి పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Next Story