Mon Dec 23 2024 14:15:15 GMT+0000 (Coordinated Universal Time)
పేలిన గ్యాస్ సిలిండర్.. నాలుగు ఇళ్లు దగ్ధం
మేకల వీరమ్మ అనే మహిళ తన పూరింట్లో గ్యాస్ పొయ్యి వెలిగించి, దానిపై పాలు పెట్టి బయట పనులు చేసుకుంటుంది. ఇంతలో
గ్యాస్ సిలిండర్ పేలి నాలుగు ఇళ్లు దగ్ధమైన సంఘటన గరికపర్రు గ్రామంలోని చెరువుకట్టపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మేకల వీరమ్మ అనే మహిళ తన పూరింట్లో గ్యాస్ పొయ్యి వెలిగించి, దానిపై పాలు పెట్టి బయట పనులు చేసుకుంటుంది. ఇంతలో గ్యాస్ సిలిండర్ లీకై పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఇంట్లోనుంచి మంటలు రావడాన్ని గమనించిన వీరమ్మ వెంటనే ఇంట్లోనే ఉన్న తన పిల్లవాడిని ఎత్తుకొని బయటకు పరుగు లంకించింది. ఇంతలోనే గ్యాస్ బండ పేలడంతో పక్కనే ఉన్న మర్రికంఠ సోమేశ్వరరావు, మర్రికంఠ నాగయ్య, పాల్వయి లింగమ్మ ఇళ్లకు మంటలు అంటుకున్నాయి.
రూ.5 లక్షలు ఆస్తి నష్టం
ఆ ఇళ్లల్లో ఉన్న ఆయా కుటుంబాల సభ్యులు మంటలను గమనించి ప్రాణభయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇంట్లో ఉన్న సామాన్లు.. కనీసం బట్టలు కూడా తెచ్చుకునే వీలు లేకుండా కళ్లెదుటే కట్టుకున్న గుడిసెలు కాలిపోయాయి. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామంటూ బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న ఉయ్యూరు అగ్నిమాపక అధికారి టి.శ్రీనివాసరావు, సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.5 లక్షలు మేర ఆస్తినష్టం వాటిల్లి ఉండవచ్చని అగ్నిమాపక అధికారి తెలిపారు.
Next Story