Mon Dec 30 2024 16:44:16 GMT+0000 (Coordinated Universal Time)
కిడ్నాపర్ నుండి బాలికను కొనుగోలు చేసి.. దారుణం
విచారణలో భాగంగా కొందరు అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. ఆ క్రమంలో బాలిక ఆచూకీకి
ఓ కిడ్నాపర్ నుండి 15 ఏళ్ల బాలికను కొనుగోలు చేసి.. ఆమెపై రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దసరా వేడుకల సమయంలో.. అక్టోబర్ 11న ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో 15 ఏళ్ల బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ బాలికను హరియాణాలోని 35 ఏళ్ల వ్యక్తికి అమ్మేశారు. బాలికను కొనుగోలు చేసిన ఆ వ్యక్తి బాలికపై తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా కొందరు అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. ఆ క్రమంలో బాలిక ఆచూకీకి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. బాలికను కిడ్నాపర్లు హరియాణాలోని సోనిపత్ కు తరలించారని తెలుసుకున్న ఛత్తీస్ గఢ్ పోలీసులు.. బాలికను ఆ వ్యక్తి చెర నుండి రక్షించారు.
తిరిగి ఛత్తీస్ గఢ్ కు తీసుకొచ్చాక.. ఆ బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడని తేల్చారు. బాలికను కొనుగోలు చేసి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడితో పాటు.. కొరియా జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు, మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు.
Next Story