Mon Dec 23 2024 14:13:36 GMT+0000 (Coordinated Universal Time)
వికారాబాద్ లో కలకలం.. గ్రామ శివారులో బాలిక హత్య !
నిందితుడు బాలికను రాయితో మోది చంపేసిన ఆనవాళ్లున్నాయి. బాలికను హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి..
వికారాబాద్ జిల్లాలో బాలిక హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో ఓ బాలికను యువకుడు దారుణంగా హతమార్చాడు. బాలిక గ్రామశివారుకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
నిందితుడు బాలికను రాయితో మోది చంపేసిన ఆనవాళ్లున్నాయి. బాలికను హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు స్పందించారు. ఆమె ప్రియుడిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. బాలికపై అత్యాచారం జరిగిందా? నిందుతుడు ఎవరు ? ఆమె ప్రియుడే నిందితుడైతే ఎందుకు హత్య చేశాడు ? అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Next Story