Mon Dec 23 2024 12:59:42 GMT+0000 (Coordinated Universal Time)
బాలికపై మైనర్ హత్యాచారం.. తండ్రిపై ప్రతీకారమా ?
ప్రతీకారం పేరుతో ఓ 15 ఏళ్ల మైనర్.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడ్డాడు. తనపై దాడికి పాల్పడిన వ్యక్తిపై ప్రతీకారం..
ప్రతీకారం పేరుతో ఓ 15 ఏళ్ల మైనర్.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడ్డాడు. తనపై దాడికి పాల్పడిన వ్యక్తిపై ప్రతీకారం పేరుతో అతని కూతురి ఉసురు తీసేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో డిసెంబర్ 1న వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్ ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తి తన ఇంటి దగ్గరలో ఉండే పదిహేనేళ్ల బాలుడితో ఇటీవల గొడవపడి దాడి చేశాడు. దాంతో కోపం తెచ్చుకున్న బాలుడు తనపై దాడిచేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అవకాశం కోసం ఎదురుచూశాడు.
అతని తొమ్మిదేళ్ల కూతురు ఒంటరిగా కనిపించింది. అదే అదనుగా భావించిన యువకుడు ఆ బాలికను కిడ్నాప్ చేసి.. దూరంగా ఉన్న రైల్వేస్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక గొంతుకోసి చంపి.. అక్కడి నుండి పరారయ్యాడు. బాలిక కనిపించకపోవడం తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారంతా వెతకడం మొదలుపెట్టారు. గురువారం ఉదయం బాలిక మృతదేహం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు, బాలిక తండ్రికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ కు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బాలుడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతడి గురించి ఆరా తీయగా గొడవ విషయం తెలిసింది. ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని, విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై పోక్సోతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Next Story