Wed Dec 25 2024 03:06:11 GMT+0000 (Coordinated Universal Time)
జుట్టు రాలిపోతోందని ఊహించని నిర్ణయం తీసుకున్న యువతి
కర్ణాటక రాష్ట్రం మైసూరులోని రాఘవేంద్ర ఎక్స్టెన్షన్లో యువతి ఆత్మహత్య చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రం మైసూరులోని రాఘవేంద్ర ఎక్స్టెన్షన్లో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇటీవలి కాలంలో వెంట్రుకలు విపరీతంగా రాలిపోతూ ఉండడంతో ఆమె ఈ దారుణమైన నిర్ణయాన్ని తీసుకుందని పోలీసు అధికారులు శనివారం తెలిపారు. మృతురాలిని కావ్యశ్రీ (21) గా గుర్తించారు. ఓ జబ్బు కారణంగా ఆమె తల వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయని.. దీంతో మనస్థాపం చెందిన కావ్యశ్రీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నజరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఓ జబ్బు కారణంగా కావ్యశ్రీకి కొన్ని రోజుల్లోనే జుట్టు మొత్తం ఊడిపోతూ రూపురేఖలన్నీ మారాయి. చికిత్స కోసం ఆమె ఎన్నో చికిత్సలు చేయించుకుంది. కానీ ఫలితం లేకపోవడంతో చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఆత్మహత్య చేసుకుంది.
Next Story