Sun Dec 22 2024 18:11:10 GMT+0000 (Coordinated Universal Time)
బస్సులో బాలికపై అత్యాచారం.. సీరియస్ గా తీసుకున్న పోలీసులు
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఢిల్లీ - డెహ్రాడూన్ బస్ టెర్మినల్ బస్సులో బాలికను ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కోల్కత్తా ఆసుపత్రిలో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా మరో సంఘటన కూడా తీవ్ర కలకలం రేపుతుంది. ఉత్తరాఖండ్ లో బాలికపై అత్యాచారం చేసిన ఘటన సభ్య సమాజాన్ని కలవరపెట్టింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో అంతరాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న ఢిల్లీ - డెహ్రాడూన్ బస్ టెర్మినల్ బస్సులో బాలికను ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఆలస్యంగా జరిగిన ఈ ఘటన పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
బస్సులో ఉన్న...
ఈ నెల 12వ తేదీన ఈ అత్యాచార ఘటన జరిగింది. వెంటనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ కు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటన జరిగిన బస్సును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో బస్సు డ్రైవర్ తో పాటు కండక్టర్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింతో లోతుగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Next Story