Mon Dec 23 2024 10:05:39 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్పత్రిలో మృతి చెందిన లైంగిక దాడి బాధితురాలు
మద్దూర్ మండలానికి చెందిన దివ్యాంగ యువతిపై కోయిల్ కొండ మండలం ఇంజమూర్ గ్రామానికి చెందిన వెంకట్రాములు నిన్న రాత్రి లైంగిక
తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో నిన్న లైంగిక దాడికి గురైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. మద్దూర్ మండలానికి చెందిన దివ్యాంగ యువతిపై కోయిల్ కొండ మండలం ఇంజమూర్ గ్రామానికి చెందిన వెంకట్రాములు నిన్న రాత్రి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో.. ఆగ్రహావేశానికి గురైన ఆ కామాంధుడు యువతిపై దాడి చేశాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Also Read : చిన్నికృష్ణపై దాడికి యత్నం.. పోలీసులకు ఫిర్యాదు
స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పి.. యువతిని మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి శనివారం తుదిశ్వాస విడిచింది. యువతి మరణానికి కారణమైన వెంకట్రాములను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story