Mon Dec 23 2024 12:38:08 GMT+0000 (Coordinated Universal Time)
ఆగని శ్రద్ధ తరహా హత్యోదంతాలు.. తాజాగా మరో ప్రియురాలిని చంపిన ప్రియుడు
నాగౌర్ జిల్లా శ్రీ బాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాసర్ గ్రామ నివాసి, వివాహిత పేరు గుడ్డి. జనవరి 20న..
ఢిల్లీలో జరిగిన శ్రద్ధ హత్య కేసు ఘటన.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శ్రద్ధ తరహా ఘటనలు చాలానే వెలుగుచూశాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన నిక్కీయాదవ్ హత్యోదంతం కూడా శ్రద్ధ ఘటనను గుర్తుచేసింది. తాజాగా రాజస్థాన్ లోని నాగౌర్ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని తానే చంపేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. పోలీసులకు కూడా దొరకకుండా ఉండేందుకు వాటిని బావిలోకి విసిరేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగౌర్ జిల్లా శ్రీ బాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాసర్ గ్రామ నివాసి, వివాహిత పేరు గుడ్డి. జనవరి 20న ఆమె పుట్టింటి నుంచి వెళ్లిపోయింది. అత్తమామల ఇంటికి వెళుతున్నానని చెప్పింది. కానీ, ఆ రోజు ఆమె తన అత్తమామల ఇంటికి చేరుకోలేదు. మహిళ కోసం బంధువులు చుట్టుపక్కలంతా గాలించారు. తెలిసిన వారు, బంధువుల ఇళ్లలోనూ వెతికారు. కానీ ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
మహిళ ఆచూకీ కోసం గాలిస్తుండగానే..ఆమె ప్రియుడి గురించి తెలిసింది. అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. నేరాన్ని అంగీకరించాడు. తన ప్రియురాలిని హత్య చేసి.. ముక్కలుగా నరికి, దేర్వా గ్రామ సమీపంలోని బావిలో పడేసినట్లు తెలిపాడు. ఆ ప్రాంతానికి వెళ్లిచూసిన పోలీసులకు మృతురాలి శరీర భాగాలు లభ్యమయ్యాయి. బంధువుల రక్త నమూనాలను తీసుకొని మృతదేహం ముక్కలతో డీఎన్ఎ మ్యాచ్ చేశారు. వైద్య పరీక్షల్లో మృతదేహం ముక్కలు మహిళకు చెందినవని తేలింది. నిందితుడిని అరెస్ట్ చేశారు.
Next Story