Mon Dec 23 2024 00:31:24 GMT+0000 (Coordinated Universal Time)
బరువైన సూట్ కేసును మహిళ మోసుకుని వెళ్తుంటే.. పోలీసులు సహాయం చేయాలనుకున్నారు.. తీరా..?
మహిళ తన పేరు ప్రీతి శర్మ అని, ఘజియాబాద్‌లోని తులసి నికేతన్‌లో నివసిస్తున్న దీపక్ యాదవ్ భార్య
ఈ రోజుల్లో లివ్-ఇన్ రిలేషన్షిప్ ట్రెండ్ పెరుగుతోంది. ఈ సంబంధాలలో గొడవలు కూడా ఎక్కువవుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు తమ భాగస్వామిని చంపడానికి కూడా వెనుకాడరు. అలాంటి సంచలన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఒక మహిళ తన భాగస్వామిని దారుణంగా చంపింది. ఆ మహిళ తన భాగస్వామిని చంపడమే కాకుండా.. తన నేరాన్ని దాచడానికి పెద్ద ప్లాన్ వేసింది. ఆ మహిళ తన భాగస్వామి మృతదేహాన్ని పారవేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
తిలా మోర్ స్టేషన్ ఏరియా వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మహిళ బరువైన ట్రాలీ బ్యాగ్‌ని లాగుతున్నట్లు గుర్తించారు. పోలీసులను చూసి భయాందోళనకు గురైన మహిళ పారిపోయేందుకు ప్రయత్నించింది. మహిళ చర్యపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం బ్యాగ్ లో ఏముందో అని వెతకడం ప్రారంభించారు. బ్యాగ్‌ని తెరిచి చూడగా అందులో మృతదేహం ఉండటంతో పోలీసు బృందం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
మహిళ తన పేరు ప్రీతి శర్మ అని, ఘజియాబాద్‌లోని తులసి నికేతన్‌లో నివసిస్తున్న దీపక్ యాదవ్ భార్య అని వెల్లడించింది. మృతదేహం గురించి మహిళను అడిగినప్పుడు.. అతడు ఆమె తన లివ్-ఇన్ రిలేషన్ షిప్ భాగస్వామి ఫిరోజ్ అని చెప్పుకొచ్చింది. అతను సంభాల్ నివాసి అని చెప్పింది. తాను కొన్ని సంవత్సరాల క్రితం తన భర్త దీపక్ యాదవ్‌ను విడిచిపెట్టానని, అప్పటి నుండి ఫిరోజ్‌తో నివసిస్తున్నానని మహిళ పోలీసులకు తెలిపింది. ఆగస్టు 6వ తేదీ రాత్రి వీరి మధ్య గొడవ జరిగింది. పెళ్లి చేసుకోవాలని తన భాగస్వామి ఫిరోజ్‌పై మహిళ ఒత్తిడి తీసుకురాగా అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఫిరోజ్ ప్రీతిపై కోపంతో.. నువ్వు జిత్తులమారివి, నీ భర్తనే కాదనుకున్నదానివి.. నీకు నేనెంత అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ మహిళ తీవ్ర ఆగ్రహంతో ఫిరోజ్ గొంతు కోసింది. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని దాచడానికి ఆమె చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
Next Story