Fri Nov 22 2024 14:39:03 GMT+0000 (Coordinated Universal Time)
"నీ భార్యను మాకు ఇవ్వు"
ఓ మహిళను వేధించి, ఆమె ఫోటోలను అనుమతి లేకుండా తీయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు
ఓ మహిళను వేధించి, ఆమె ఫోటోలను అనుమతి లేకుండా తీయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని బందాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తులు చేస్తున్న పనిని మహిళ భర్త అడ్డుకోగా.. 'నీకు అలాంటి భార్య అవసరం లేదు. అంత అర్హత నీకు లేదు.. నీ భార్యను మాకు ఇచ్చేయ్' అంటూ రెచ్చిపోయారు. ఈ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ప్రవర్తనపై అభ్యంతరం చెప్పడమే కాకుండా.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిందితులు తనను, తన పిల్లలను కూడా చంపేస్తానని బెదిరించారని భార్యాభర్తలు పోలీసుల ముందు వాపోయారు. నా భార్య చిత్రాలను క్లిక్ చేయడానికి ప్రయత్నించడంపై నేను అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారు నన్ను దుర్భాషలాడారని భర్త తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గ్రామపెద్దల ఒత్తిడి కారణంగా పోలీసులు మొదట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపాడు. సదరు వ్యక్తి సీనియర్ పోలీసు అధికారికి ఫిర్యాదు చేసి నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. "ఒక వ్యక్తి తన భార్యను వేధించినందుకు ఇద్దరు వ్యక్తులపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన జసోలా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేము IPC లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసాము. సాక్ష్యాధారాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. నిందితులను అరెస్టు చేస్తాం. త్వరలో జైలుకు పంపిస్తాం" అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Next Story