Fri Dec 20 2024 05:12:35 GMT+0000 (Coordinated Universal Time)
ఈ కేసును ఏసీబీకి బదిలీ
తెలుగు అకాడమీ స్కాం కేసును ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసింది.
తెలుగు అకాడమీ స్కాం కేసును ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసింది. తెలుగు అకాడమీలో దాదాపు 60 కోట్ల కు పైగానే అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంలో ఎక్కువగా ఉద్యోగుల పాత్ర ఉండటం, వారికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని తెలియడంతో ఈ కేసును సీబీఐ కి అప్పగించారు.
60 కోట్ల స్కాం....
మొన్నటి వరకూ తెలుగు అకాడమీ కేసును సీసీఎస్ పోలీసులు విచారించారు. తెలుగు అకాడమీలో 60 కోట్ల మేర నిధులు గోల్ మాల్ అయినట్లు గుర్తించారు. బ్యాంకు అధికారుల పాత్ర కూడా గమనించారు. ఈకేసులో ఇప్పటికే పలువురిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు బ్యాంకు అధికారులకు లంచం కూడా ఇవ్వడంతో ఈ కేసును ఏసీబీకి అప్పగించాలని నిర్ణయించారు. మొత్తం నాలుగు కేసులను ఏసీబీ కి బదిలీ చేశారు.
Next Story