Mon Dec 15 2025 04:06:45 GMT+0000 (Coordinated Universal Time)
సంగారెడ్డిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య !
సోమవారం పాఠశాలకు వెళ్లిన అనిత.. మధ్యాహ్నం నుంచి స్కూల్ లో కనిపించకపోవడంతో ఆమె తోటి ఉపాధ్యాయులు

ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కక్కర్ వాడలో వెలుగుచూసింది. సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి చెందిన అనిత(28) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సోమవారం పాఠశాలకు వెళ్లిన అనిత.. మధ్యాహ్నం నుంచి స్కూల్ లో కనిపించకపోవడంతో ఆమె తోటి ఉపాధ్యాయులు అనిత కోసం వెతికారు. ఆఖరికి పాఠశాల పరిసరాల్లోని బావి వద్ద అనిత చెప్పులు కనిపించాయి. దాంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బావివద్దకు చేరుకున్న పోలీసులు.. అందులోని నీటిని తోడేసి ఉపాధ్యాయురాలు అనిత మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. అనారోగ్య సమస్యలు, మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల అని ఆందోళనగా కనిపిస్తోందని కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన బండి సంజయ్
Next Story

