Tue Mar 25 2025 21:35:15 GMT+0000 (Coordinated Universal Time)
బిరియానీ లేట్ గా వచ్చిందని బాదేశారు..?

రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఏదైనా ఆర్డర్ ఇస్తే కాస్త ఓపిక పట్టాలి. అలాగని చెప్పి అక్కడ పని చేసే వ్యక్తులపై తమ కోపాన్ని ప్రదర్శిస్తే జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా అలా కోపాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిర్యానీ ఆర్డర్ తీసుకురావడంలో జాప్యం కారణంగా గ్రేటర్ నోయిడా రెస్టారెంట్ సిబ్బందిపై దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, తమ ఆర్డర్ను సిద్ధం చేయడంలో కొంచెం ఆలస్యం కావడంతో అన్సల్ మాల్లోని జోక్ రెస్టారెంట్ సిబ్బందిని దాద్రీకి చెందిన ముగ్గురు వ్యక్తులు కొట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు రెస్టారెంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారని అధికారులు తెలిపారు.
Greater Noida restaurant staffer thrashed after biryani order gets delayed
Next Story