Tue Dec 24 2024 00:20:12 GMT+0000 (Coordinated Universal Time)
సత్యసాయి జిల్లాలో ఆగివున్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
బెంగుళూరు వైపు వెళుతున్న గ్రీన్ ట్రావెల్స్ బస్సు చిలమత్తూరు మండల పరిధిలోని కోడూరు సమీపంలో 44 వ జాతీయ రహదారిపై
కోడూరు : శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని కోడూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బెంగుళూరు వైపు వెళుతున్న గ్రీన్ ట్రావెల్స్ బస్సు చిలమత్తూరు మండల పరిధిలోని కోడూరు సమీపంలో 44 వ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ముందుగా వెళుతున్న సిమెంట్ లారీని వెనకవైపు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వెనుక ఉన్న ఓ మహిళతోపాటు ఇద్దరు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. మిగిలినవారికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడినవారిని మూడు అంబులెన్స్‌ల సాయంతో హిందూపురం, కర్నాటక బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన డ్రైవర్ బెంగుళూరుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్రేన్ ల సాయంతో బస్సును వెనక్కి లాగి డ్రైవర్ మృత దేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రయాణీకులలో ఎక్కువమంది గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వారిగా గుర్తించారు. వెంకటరెడ్డి, ఆదిలక్ష్మి, బార్యభర్తలు వీరి పిల్లలు దేదీప్య, కుశలఈశ్వర్ రెడ్డి లు డ్రైవర్ సీటు వెనుక భాగాన ఉన్నారు. వీరిని హిందూపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బస్సు క్లీనర్ శ్రీనివాసులు, రమేష్, ప్యాసింజర్ సంతోష్, వెంకటకృష్ణారెడ్డి కుటుంబం, సంతోష్.. లు గాయపడిన వారిలో ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story