Sun Dec 22 2024 16:16:55 GMT+0000 (Coordinated Universal Time)
వరుడి తండ్రితో పారిపోయిన వధువు తల్లి.. పెళ్లికి ముందే!
వరుడి తండ్రి, వధువు తల్లితో పారిపోయాడు
ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్లో పెళ్లికి ముందు ఊహించని ఘటన చోటు చేసుకుంది. వరుడి తండ్రి, వధువు తల్లితో పారిపోయాడు. ఇద్దరూ పారిపోవడంతో ఇరు కుటుంబాల్లో కలకలం రేగింది. వరుడి తండ్రిపై.. వధువు తండ్రి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ ఉదంతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. జిల్లాలోని గంజ్ దుండ్వారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పప్పు ఇంటికి తరచూ వచ్చే షకీల్ కొడుకుతో పప్పు కూతురు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి తేదీ దగ్గరపడుతుండగా, షకీల్ పప్పు భార్యతో పారిపోయి ఇరు కుటుంబాలకు షాక్ ఇచ్చాడు. షకీల్ తన భార్యను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని పప్పు ఆరోపించాడు. తన భార్యను కిడ్నాప్ చేశాడని షకీల్పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
షకీల్కు 10 మంది పిల్లలు, వధువు తల్లికి 6 మంది పిల్లలు. ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. తన భార్య అదృశ్యంపై పప్పు మాట్లాడుతూ.. షకీల్ ఆమెను కిడ్నాప్ చేశాడని ఆరోపించాడు. తన కుమార్తెకు షకీల్ కుమారుడితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నామని ఇంతలో ఇలాంటి ఘటన చోటు చేసుకుందని అన్నారు. షకీల్ తన భార్యను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని.. నా భార్య గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని పప్పు చెబుతున్నాడు. ఠాణా గంజ్ దుంద్వారాలో ఈ ఘటనకు సంబంధించి ఓ కేసు నమోదైందని సీఓ విజయ్ కుమార్ రాణా తెలిపారు. నిబంధనల ప్రకారం పోలీసులు విచారణ మొదలుపెట్టారని తెలిపారు.
Next Story