Mon Dec 23 2024 11:54:34 GMT+0000 (Coordinated Universal Time)
శామీర్ పేటలో కాల్పుల కలకలం.. బుల్లితెర నటుడిపై కేసు
ఇద్దరి ఎఫైర్ గురించి సిద్ధార్థ్ ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మనోజ్ తన వద్దనున్న ఎయిర్ గన్ తో..
హైదరాబాద్ లోని శామీర్ పేట్ సెలబ్రిటీ క్లబ్ లో కాల్పుల కలకలం రేగింది. తన భార్యతో ఉన్న ప్రియుడిని ప్రశ్నించిన భర్తపై.. ప్రియుడు ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. భార్య వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించినందుకే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తి భార్యతో.. సీరియల్ ఆర్టిస్ట్ మనోజ్ సెలబ్రిటీ క్లబ్ లో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్.. క్లబ్ కు వెళ్లి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.
ఇద్దరి ఎఫైర్ గురించి సిద్ధార్థ్ ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మనోజ్ తన వద్దనున్న ఎయిర్ గన్ తో సిద్ధార్థ్ పై కాల్పులు జరపడం కలకలం రేపింది. కాల్పుల నుంచి తప్పించుకున్న బాధితుడు ఘటనపై శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిద్ధార్థ్ ఫిర్యాదు మేరకు పోలీసులు మనోజ్ పై కేసు నమోదు చేశారు. కాల్పులకు వివాహేతర సంబంధమే కారణమని గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా మనోజ్.. పలు తెలుగు సీరియల్స్ లో నటించాడు.
Next Story