Fri Dec 20 2024 13:57:11 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే అవినాష్ ను అరెస్ట్ చేస్తాం
గుంటూరులో చలానా కుంభకుణంపై గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు స్పందించారు
గుంటూరులో చలానా కుంభకుణంపై గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు స్పందించారు. ఈ చలానా కుంభకుణంలో 36,52 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామన్నారు. కొమ్మిరెడ్డి అవినాష్ కు చెందిన రేజర్ పీఈ ఖాతాకు ఈ నిధుల మళ్లింపు జరిగిందని చెప్పారు. పీఈ ఖాతా నుంచి డీజీ ఖాతాకు నగదు జమ కాలేదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని సెప్టంబరులోనే గుర్తించామని, తిరుపతి యూనిట్ లో గుర్తించి డేటా సొల్యూషన్ నిర్వాహకుడు అవినాష్ ను సంజాయిషీ కోరామని తెలిపారు.
మాజీ డీజీపీ బంధువు...
నిధుల తరలింపుపై డేటా సొల్యూషన్స్ ప్రతినిధి రాజశేఖర్ ను కూడా ప్రశ్నించామని చెపపారు. సరైన సమాచారం ఇవ్వకుండా అవినాష్ కాలయాపన చేశారని పాలరాజు తెలిపారు. రాజశేఖర్ ను అరెస్ట్ చేసి విచారణ జరిపామన్న ఆయన విాచరణలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు అంగీకరించారని తెలిపారు. అవినాష్ ఆస్తుల విషయంపై సబ్ రిజిస్ట్రార్‌కు లేఖలు రాశామన్నారు. ఆస్తుల క్రయ విక్రయాలకు తావులేకుండా సబ్ రిజిస్ట్రార్ కు లేఖ రాశామని ఆయన తెలిపారు. త్వరలోనే నిందితుడు అవినాష్ ను పట్టుకుంటామని చెప్పారు. కొమ్మిరెడ్డి అవినాష్ మాజీ డీజీపీకి బంధవు అని కూడా ఆయన చెప్పారు.
Next Story