Mon Dec 15 2025 00:15:59 GMT+0000 (Coordinated Universal Time)
కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం.. జిమ్ ట్రైనర్ సజీవదహనం
ఈ నేపథ్యంలో జయకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ప్రమాదవశాత్తు ఇలా జరిగిందా ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ప్రసన్న నగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక జిమ్ ట్రైనర్ జయకృష్ణ సజీవదహనమయ్యాడు. ఐదురోజుల క్రితమే జయకృష్ణ తన భార్య, పిల్లలను ఊరికి పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జయకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ప్రమాదవశాత్తు ఇలా జరిగిందా ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అగ్నిప్రమాద సమయంలో జయకృష్ణ ఒక్కటే ఇంట్లో ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు.
భార్య ఇంట్లో లేకపోవడంతో.. ఉదయం బంధువులతో కలిసి మద్యం సేవించాడు. వారంతా బయటకు వెళ్లిపోగా జయకృష్ణ బెడ్రూమ్ లో పడుకున్నాడు. అదే సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. జయకృష్ణ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడా ? కుటుంబ కలహాలున్నాయా ? లేక ప్రమాద వశాత్తు అతను మంటల్లో చిక్కుకుని మరణించాడా ? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

