Sun Dec 22 2024 14:29:11 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు
హన్మకొండ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
హన్మకొండ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎల్కతుర్తి మండలం పెంచికలపేట సమీపంలోని శాంతినగర్ వద్ద ఎదురుగా వస్తున్న కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన మంతెన కాంతయ్య, శంకర్, భారత్, చందనగా గుర్తించారు. బాధిత కుటుంబం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. లోపలి చిక్కుకున్నవారిని అతికష్టంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడి లోపలి ఇరుక్కుపోయిన వారిని తీయడానికి కట్టర్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు తెలిపారు.
Next Story