Mon Dec 23 2024 09:52:18 GMT+0000 (Coordinated Universal Time)
నోరువిప్పిన హరిహరకృష్ణ.. స్టేట్ మెంట్ రికార్డులో విస్తుపోయే నిజాలు
పోలీసులు రికార్డ్ చేసిన స్టేట్ మెంట్ ప్రకారం.. హరిహరకృష్ణ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. "ఇంటర్ సెకండ్ ఇయర్ లో..
అబ్దుల్లాపూర్ మెట్ లో బీటెక్ విద్యార్థి నవీన్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఫిబ్రవరి 17న నవీన్ హత్యకు గురికాగా.. హరిహర కృష్ణ 24న పోలీసులకు లొంగిపోయాడు. నవీన్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన హరిహరకృష్ణ పోలీసుల కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో హరి స్టేట్ మెంట్ రికార్డును అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కోర్టులో అందించారు. వారంరోజులుగా హరిహరకృష్ణను విచారించిన పోలీసులు.. కీలక విషయాలను రాబట్టారు. ఆఖరికి నవీన్ ను తానే హతమార్చినట్టు నేరాన్ని అంగీకరించాడు. నిహారికను ఇబ్బంది పెడుతుండంటంతోనే నవీన్ ను చంపాలని నిర్ణయించుకున్నానని హరిహరకృష్ణ వెల్లడించాడు. నవీన్ ను చంపేందుకు రెండు నెలల క్రితమే డీమార్ట్ లో కత్తి, మెడికల్ షాపులో ప్లాస్టిక్ గ్లౌస్ లు కొన్నట్లు తెలిపాడు.
పోలీసులు రికార్డ్ చేసిన స్టేట్ మెంట్ ప్రకారం.. హరిహరకృష్ణ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. "ఇంటర్ సెకండ్ ఇయర్ లో నవీన్ నాకు పరిచయం అయ్యాడు. అతడు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో, నేను అరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాం. నిహారిక, నవీన్ ప్రేమించుకునే వారు. అయితే నవీన్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడని.. నిహారిక గొడవ పడి అతనితో మాట్లాడటం మానేసింది. నిహారిక అంటే నాకు కూడా చాలా ఇష్టం. అందుకే ఆమెతో చనువుగా ఉండే వాడిని. నవీన్ తో విడిపోయిందని తెలిసి 9 నెలల క్రితం నేను ప్రేమిస్తున్నానని నిహారికకు చెప్పాను. ఆమె ఒప్పుకుంది. అప్పటి నుండి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం."
"ఈ క్రమంలో నవీన్ మళ్లీ ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నిహారికకు నవీన్ కాల్ చేసి, మెసేజ్లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. దీంతో నవీన్ను చంపాలని డిసైడ్ అయ్యాను. రెండు నెలల క్రితమే మలక్ పేటలో ఉన్న డీ మార్ట్ లో రూ.200తో ఒక కత్తి కొన్నాను. నవీన్ ను చంపే సమయంలో కత్తిపై నా ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఉండేందుకు మెడికల్ షాపులో రెండు జతల ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నాను. వాటిని ఎవరికీ కనిపించకుండా మా ఇంట్లోనే దాచి పెట్టాను. ఫిబ్రవరి 16నే నవీన్ ను చంపేయాలనుకున్నా. కానీ కుదరకపోవడంతో.. 17న హైదరాబాద్ కు పిలిపించి చంపేశాను. పెద్ద అంబర్ పేట్ లో మద్యం తాగిన తర్వాత నవీన్ ను చెట్లపొదల్లోకి తీసుకెళ్లి గొంతునొక్కి చంపేశాను. ఆ తర్వాత తల, మొండెం వేరు చేసి, కోపంతో ఛాతీ భాగం నుంచి పొట్టవరకూ కోసేశాను. గుండెను వేరు చేశా. ఆ తర్వాత హసన్ ఇంటికెళ్లి బట్టలు మార్చుకుని జరిగిందంతా అతనితో చెప్పాను. మరుసటిరోజున నవీన్ హత్య గురించి నీహారికకు చెప్పాను " అని హరిహరకృష్ణ పోలీసుల విచారణలో వెల్లడించాడు.
నవీన్ హత్య తర్వాత భయంతో విజయవాడ, ఖమ్మం, వైజాగ్ లో తిరిగి.. 24న పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిపాడు. నవీన్ హత్యకేసులో హరిహరకృష్ణ ఏ1 నిందితుడిగా ఉండగా.. హసన్ ఏ2, నీహారిక ఏ3 నిందితులుగా ఉన్నారు. హసన్, నిహారికలు చర్లపల్లి, చంచల్ గూడ జైలులో ఉన్నారు.
Next Story