Sun Dec 22 2024 23:28:46 GMT+0000 (Coordinated Universal Time)
Murder : హత్య చేసి పారిపోయాడు... 28 ఏళ్ల తర్వాత దొరికిపోయాడు
1995లో చైన్నైలో హత్య చేసిన హరిహర పట్ట జోషి పోలీసులు కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎట్టకేలకు దొరికిపోయాడు
హత్య చేసి పారిపోతే.. దొరకకుండా ఎక్కడకూ పోరు. పోలీసులు వెంటాడి వేటాడి మరీ బొక్కలో వేస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం పోలీసుల కళ్లుగప్పి 28 ఏళ్ల నుంచి తప్పించుకుతిరుగుతున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఎట్టకేలకు చివరకు ఆ నిందితుడు పోలీసులకు దొరికిపోయాడు. ఈ అరుదైన ఘటన తమిళనాడులో జరిగింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిందితుడు పోలీసులు కన్నుగప్పి ఒడిశా రాష్ట్రంలో జీవితం కొనసాగిస్తుండటం విశేషంగానే చెప్పుకోవాలి.
1995లో హత్య చేసి...
హత్య 1995లో జరిగింది. తమిళనాడులోని అరుంబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలోని నంగనల్లూరులో 1995 ఆగస్టు 9న భార్య, అత్త, బామ్మర్దిలపై కత్తితో దాడి చేశాడు. హత్య చేసిన వ్యక్తి హరిహర పట్టజోషి కాగా ఈ కత్తి దాడిలో మరణించింది అత్త రమాదేవి. భార్య, బామ్మర్ది మాత్రం ఆసుపత్రిలో చేరి తర్వాత కోలుకున్నారు. అయితే హత్య చేసిన తర్వాత హరిహర పట్టజోషి పరారయ్యాడు. పోలీసుల కన్నుగప్పి తప్పించుకుతిరుగుతున్నాడు. అయితే ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు.
మరో పెళ్లి చేసుకుని...
సెల్ఫోన్లు కూడా వాడక పోవడంతో పోలీసులు అతగాడిని పట్టుకోలేకపోయారు. ఈ దశలో పోలీస్ స్టేషన్ లో అనేక మంది అధికారులు బదిలీపై వెళ్లిపోయారు. కొందరు పదవీ విరమణ చేశారు కూడా. అయినా నిందితుడు మాత్రం దొరకలేదు. ఈ కేసు పోలీసులకు ఛాలెంజ్ గా మారింది. అయితే 2001లో హరిహర పట్టజోషి ఒడిశాకు వెళ్లి మరొక మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే పోలీసులు వలపన్ని అతగాడిని పట్టుకున్నారు. హత్య చేసి 28 ఏళ్ల తర్వాత దొరికపోవడంతో అతగాడిని చూసేందుకు బంధువులు, చుట్టుపక్కల వాళ్లు అధిక సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు తరలి వచ్చారు.
Next Story