Sun Dec 22 2024 19:57:37 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో తెలుగు యువతి మృతి.. రోడ్డు ప్రమాదంలో
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హారిక అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మరణించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన హారిక ఈ ప్రమాదంలో చనిపోయింది. హారిక తండ్రి శ్రీనివాసరావు దేవాదాయ శాఖలో పనిచేస్తున్నారు. తెనాలికి చెందిన హారిక అమెరికాలోని ఒక్లహోమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఏడాదిన్నర క్రితం వెటర్నరీ విద్యలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు.
మృతదేహాన్ని...
తమ కుమార్తె మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు చొరవ తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. ఒక్లహోమాలో మూడు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హారిక మృతితో శ్రీనివాసరావు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు, సన్నిహితులు హారిక కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.
Next Story