Mon Dec 23 2024 05:10:31 GMT+0000 (Coordinated Universal Time)
గల్ఫ్ ప్రయాణికుల దోపిడీకి యత్నం
శంషాబాద్ నుంచి గల్ఫ్ ప్రయాణికులతో వస్తున్న బస్సులో దోపిడీకి ప్రయత్నించాడు. ప్రయాణికులు దొంగను అడ్డగించారు.
శంషాబాద్ నుంచి గల్ఫ్్ ప్రయాణికులతో వస్తున్న బస్సులో దోపిడీకి ప్రయత్నించాడు. శంషాబాద్ నుంచి కోనసీమ జిల్లాకు వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు పాలకొల్లు సమీపంలోకి రాగానే ప్రయాణికుల నుంచి ఒకడు దోపిడీకి ప్రయత్నించాడు. ముసుగు వేసుకున్న దొంగ ప్రయాణికుల కళ్లలో కారం చెల్లి విలువైన వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అయితే బస్సు సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా అతనిని అడ్డుకున్నారు.
పట్టుకున్న ప్రయాణికులు...
దొంగ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ప్రయాణికులు అడ్డుకున్నారు. దొంగను ప్రతిఘటించి పట్టుకున్నారు. పాలకొల్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు దొంగను అప్పగించారు అనంతరం బస్సు ప్రయాణికులతో రాజోలు చేరింది. బస్సులోకి దొంగ ఎలా ప్రవేశించాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
- Tags
- passengers
- thief
Next Story