Tue Nov 26 2024 11:48:49 GMT+0000 (Coordinated Universal Time)
ఇంత ట్రాజెడీనా.. సోదరితో రాఖీ కట్టించుకోడానికి వెళుతుండగా..!
దేశ రాజధానిలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
దేశ రాజధానిలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. రాఖీ కట్టించుకోవడం కోసం తన సోదరి ఇంటికి వెళుతున్న బైకర్ ప్రాణాలను కోల్పోయాడు. గాలిపటానికి ఉన్న మాంజా అతడి ప్రాణాలను తీసింది. చైనీస్ మాంజాలకు గాజు పూత పూసింటారు. గాలిపటాల పోటీలలో పాల్గొనే వ్యక్తులు ఈ మాంజాతో ఇతరుల గాలిపటాలను తెంచేస్తూ ఉంటారు. ఆ గాలిపటం తీగ అతని గొంతుకు తగలడంతో అతడు మరణించాడు. గతంలో అనేక ప్రమాదాలకు కారణమైన గ్లాస్ కోటెడ్ తీగలను 2016 నుండి ఢిల్లీలో నిషేధించారు, అయినప్పటికీ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ నెలలో ఢిల్లీలో ఈ తరహా ఘటన సంభవించడం ఇది రెండోసారి.
35 ఏళ్ల విపిన్ కుమార్ లోనిప్రాంతం లోని సోదరి ఇంటికి వెళ్లి రక్షా బంధన్ వేడుకలను జరుపుకోవడానికి భావించాడు. శాస్త్రి పార్క్ ఫ్లైఓవర్‌పై తన భార్యతో కలిసి బైక్‌పై వెళుతుండగా పదునైన తీగ అతని మెడకు తగలడంతో గాయపడ్డాడు. చుట్టుపక్కల వారి సహాయంతో, అతని భార్య అతన్ని సివిల్ లైన్స్‌లోని ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లింది, అక్కడ వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చైనీస్ సింథటిక్ మాంజా విక్రయాలపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించడాన్ని అమలు చేయమని కోరింది. గాలిపటాలు ఎగరడం, అమ్మడం, కొనుగోలు చేయడం, నిల్వ చేయడం మరియు రవాణా చేయడంపై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను కోర్టు విచారించింది. గాజు పూతతో కూడిన దారాల వల్ల కలిగే ప్రమాదాల కారణంగా చాలా మంది వ్యక్తులు, పక్షులు ప్రాణాలు కోల్పోతున్నారు.
News Summary - He Was To Meet Sister For Rakhi, Kite String Slit Throat On Delhi Flyover
Next Story