Sun Dec 22 2024 16:23:18 GMT+0000 (Coordinated Universal Time)
జాతీయ రహదారిపై నగ్నంగా మహిళ మృతదేహం.. తల దొరికిందంటున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని గుజైని వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఒక మహిళ మృతదేహం
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని గుజైని వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఒక మహిళ మృతదేహం కనుగొన్నారు. మొండెం మాత్రమే కనిపించింది. ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా పోలీసులు ఇంకా అందుకు సంబంధించిన పురోగతి సాధించలేదు. గుజైనిలోని కాన్పూర్-ఢిల్లీ హైవేపై నగ్నంగా తల లేని మహిళ మృతదేహం కనుగొన్నామని, మహిళ ఆచూకీ కనుక్కోడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం కాన్పూర్లోని గుజైనిలో హైవేపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో పోలీసులు ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదు. మహిళ గుర్తింపును నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. మహిళ ఎముకలు విరిగిపోయాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) రవీందర్ కుమార్ తెలిపారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు కనిపించలేదన్నారు పోలీసులు. మహిళను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. హైవేకి అవతలి వైపు ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఓ మహిళ అందులో నడుస్తున్నట్లు గుర్తించారు. ఫుటేజీలో ఉన్న మహిళ బూడిద రంగు ప్యాంటు ధరించి కనిపించింది. మృతదేహానికి సమీపంలో బూడిద రంగు వస్త్రం కనిపించింది.
ఈ ఘటనపై విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మహిళ ధరించిన దుస్తులు, హైవేపై దొరికిన గుడ్డ ముక్కలకు, చెప్పులకు సరిపోతాయని పోలీసులు తెలిపారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి మరిన్ని ఆధారాలు సేకరిస్తామని చెబుతున్నారు. మహిళ మరణానికి తక్షణ కారణం స్పష్టంగా తెలియనప్పటికీ.. కాన్పూర్ అదనపు కమిషనర్ హరీష్ చంద్ర మాత్రం ఇది రోడ్డు ప్రమాదం కారణంగా జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. తల దొరికిందని, ఆమె బట్టలు కూడా దొరికాయని చెప్పారు. పెద్ద వాహనం గుద్దడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత మిగతా విషయాలు వెల్లడవుతాయని తెలిపారు.

Next Story