Fri Dec 27 2024 09:45:02 GMT+0000 (Coordinated Universal Time)
చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 7 కోట్ల విలువైన హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఏడు కోట్ల విలువైన హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి చెన్నైకి వచ్చిన ఉగాండా దేశస్థుడు ఈ హెరాయిన్ ను తీసుకు వచ్చాడు. హెరాయిన్ ను 108 క్యాప్సూల్ లలో నింపి లో దుస్తులలో దాచాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.
లోదుస్తుల్లో దాచి....
చెన్నై ఎయిర్ పోర్టులో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం ఇది కొత్త కాదు. గతంలోనూ అనేక సార్లు కస్టమ్స్ అధికారులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఉగాండా దేశస్థుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు అతడిని విచారణ చేస్తున్నారు. ఎవరికి విక్రయించడానికి ఈ డ్రగ్స్ ను తీసుకు వచ్చాడు? దీని వెనక ఎవరున్నారు? అన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story