Thu Dec 19 2024 16:40:08 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
బెంగళూరులో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్ల నుంచి మూడు కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్ల నుంచి మూడు కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నైజీరియన్లు బెంగళూరులోని సినీరంగానికి చెందిన వారితో పాటు పారిశ్రామికవేత్తలు, విద్యార్థులకు ఈ డ్రగ్స్ ను అందిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
తొలిసారి ఆ డ్రగ్....
దీంతో పాటు తొలిసారిగా కర్ణాటకలో బ్లాక్ ఎండీఎంఏ డ్రగ్ ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ బ్లాక్ ఎండీఎంఏ కేవలం విదేశాల్లో మాత్రమే లభిస్తుందంటున్నారు. రాజణ్ణ లే అవుట్ లో నివసించే సక్టస్ హుచిక్, చుకుబమ్ హెన్రీలను పోలీసులు అదుపులోికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Next Story