Mon Dec 23 2024 18:22:58 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ప్రయాణికుడి నుంచి కోటి రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఒక ప్రయాణికుడి నుంచి కోటి రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీలో ఈ విషయం బయటపడింది. దుబాయ్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద 2,330 గ్రాముల బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్యాంట్ లోపలి భాగంలో.....
ప్యాంట్ లోపలి భాగంలో ప్రత్యేకంగా బెల్ట్ ను ఏర్పాటు చేసుకుని అక్కడ బంగారాన్ని దాచాడు. గొలుసుల రూపంలో దానిని తీసుకెళ్లడాన్ని గుర్తించి కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Next Story