Mon Apr 14 2025 23:16:07 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్లోనే ఉన్నా : నవదీప్
తాను హైదరాబాద్ లోనే ఉన్నానని తాను ఎక్కడికీ పారిపోలేదని సినీ హీరో నవదీప్ తెలిపారు

తాను హైదరాబాద్ లోనే ఉన్నానని తాను ఎక్కడికీ పారిపోలేదని సినీ హీరో నవదీప్ తెలిపారు. ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. ఆయన ఫోన్ మాత్రం స్విచాఫ్ లేదు. తాను హైదరాబాద్ లో ఒక సినిమా ప్రొమోషన్ లో ఉన్నానని చెబుతున్నారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని కూడా నవదీప్ చెప్పారు. తన పేరు ఎందుకు వచ్చిందో తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
విచారణకు...
తాను పిలిస్తే పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని కూడా ఆయన అంటున్నారు. ఇప్పటి వరకూ తనకు పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదన్న నవదీప్ తన పేరు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని తెలిపారు. పోలీసులు మాత్రం నవదీప్ పేరును ప్రస్తావించారు. గతంలో నవదీప్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
Next Story