Mon Dec 23 2024 01:22:12 GMT+0000 (Coordinated Universal Time)
కామాంధుల బారి నుండి బాలికను కాపాడిన హిజ్రా
హైదరాబాద్ నగరంలో బాలిక కిడ్నాప్ కు అయింది. బాలికను ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం
హైదరాబాద్ నగరంలో బాలిక కిడ్నాప్ కు అయింది. బాలికను ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశారు కొందరు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకున్న బాలిక రోడ్డు మీదికి వచ్చి ఏడుస్తూ సహయం కోసం అర్ధించింది. అటుగా వెడుతున్న ఓ హిజ్రా బాలికను చూసి రక్షించి పోలీసులకు అప్పగించింది.
హయత్ నగర్లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశారు. అయితే ఆ బాలిక దుండగుల నుంచి ఎలాగోలా తప్పించుకుంది. రోడ్డు మీదకి వచ్చి తనను కాపాడే వారి కోసం ఏడుస్తూ సహయం కోసం అర్ధించింది. అయితే అటుగా వెళుతున్న ఓ హిజ్రా బాలికను చూసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రిలో చేర్చారు. ఆ బాలికను ఎక్కడి నుండి తీసుకుని వచ్చారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.
Next Story