ఫ్యాక్టరీలో పేలుడు.. 7గురు దుర్మరణం, ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని
ప్రమాదంలో గాయపడిన 12 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుళ్ల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఏడుగురు దుర్మరణం చెందిన ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలోని ఉనా జిల్లాలోని తహ్లివల్ పారిశ్రామిక వాడలో ఉన్న పటాకుల ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
Also Read : సికింద్రాబాద్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం
ప్రమాదంలో గాయపడిన 12 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుళ్ల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ఎలా సంభవించిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ లో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది చనిపోయారు. రెండు ప్రమాదాల్లో చనిపోయిన మృతులకు ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. పేలుళ్ల ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని రిలీఫ్ ఫండ్స్ నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.