Mon Dec 23 2024 06:26:14 GMT+0000 (Coordinated Universal Time)
బయటకు వస్తున్న పూర్ణానంద సరస్వతి దారుణాలు
జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతి స్వామీజీని ఎంవీపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో స్వామీజీ వేధింపులకు పాల్పడడమే కాకుండా, బాలికపై అత్యాచారం చేసినట్టు అమరావతిలోని దిశ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలోని జ్ఞానానంద ఆశ్రమంలో మొత్తం 12 మంది పిల్లలు ఉన్నారు. అందులో నలుగురు అమ్మాయిలు, ఎనిమిది మంది అబ్బాయిలు ఉన్నారు. ఆశ్రమంలో అనాథాశ్రమం, వృద్ధాశ్రమం ఉన్నాయి. ఈ ఆశ్రమం 1955లో స్థాపించారు. దీనికి అధిపతిగా పూర్ణానంద సరస్వతి.
జూన్ 20న, ఆశ్రమంలో బాలికపై పదేపదే అత్యాచారం చేసినందుకు విశాఖపట్నం దిశా పోలీసులు స్వామీజీని అరెస్టు చేశారు. అతడిపై ఐపిసి సెక్షన్లు 323, 342, 376 (2) ఎఫ్, 376 (3) మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేశారు. జూలై 5 వరకు రిమాండ్కు తరలించారు. ACP (దిశా పోలీస్ స్టేషన్) CH వివేకానంద మాట్లాడుతూ.. ఆశ్రమంలో చదువుతున్న ఇతర బాలికలు బాధితురాలి కంటే చిన్నవారు. మేము వారితో మాట్లాడగా ఓ బాలిక తనను వేధించాడని.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు పేర్కొందన్నారు.
భోగాపురంలో ఇద్దరు పిల్లలను ఉన్న మరొక శాఖ కూడా ఉంది. కొంతమంది పిల్లలు అనాథలు కాగా, మరికొందరు తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలకు చెందినవారు. పిల్లలందరికీ ఆశ్రమ పాఠశాలలో విద్యను అందిస్తూ ఉన్నారు. ఆశ్రమంలో దాదాపు 5-6 మంది కార్మికులు నివసిస్తూ ఉండటంతో, పూర్ణానంద రాత్రి సమయంలో బాధితురాలిని, మరొక అమ్మాయిని తన గదికి పిలిచేవాడు. తన కాళ్లను పట్టాలని చెబుతూనే వారిని లైంగికంగా వేధించేవాడు. 2016లో తల్లిదండ్రులు చనిపోవడంతో బాధితురాలు రాజమండ్రిలోని గండేపల్లి సాధుమఠంలో ఉంటోంది. అయితే ఆ తర్వాత ఆమెను పూర్ణానంద ఆశ్రమానికి తరలించారు. "బాధితురాలు ఇతరుల కంటే పెద్దది. ఆమెను తన లైంగిక కోరికల కోసం స్వామీజీ లక్ష్యంగా చేసుకున్నారు. రాత్రిపూట బాధితురాలిని లైంగికంగా వేధించేవాడు, ఈ సంఘటన తర్వాత, మేము పిల్లలందరినీ ప్రభుత్వ గృహానికి తరలించాము." అని ఏసీపీ అన్నారు.
తల్లిదండ్రులు చనిపోవడంతో అనాధగా మారిన 12 ఏళ్ల బాలికను, విజయవాడకు చెందిన ఆమె పెద్దమ్మ నగరంలోని వెంకోజి పాలెంలో గల జ్ఞానానంద ఆశ్రమంలో చేర్చింది. అయితే ఆశ్రమ నిర్వాహకుడైన పూర్ణానంద సరస్వతి స్వామీజీ కళ్ళు బాలికపై పడ్డాయి. బాలికను గొలుసులతో స్వామీజీ బంధించి అత్యాచారం చేసినట్టు బాధితురాలు చెస్తోంది. ఈ తరుణంలో బాలిక అతని చెంత నుండి తప్పించుకొని విజయవాడలోని పెద్దమ్మ వద్దకు చేరుకొని, జరిగిన విషయం చెప్పడంతో, పెద్దమ్మ సహాయంతో బాలిక అక్కడి దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వామీజీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు పోలీసులను కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపించగా, అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో విజయవాడలోని దిశా పోలీసులు కేసును ఎంవీపీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్వామీజీని అదుపులోకి తీసుకున్నారు. అయితే స్వామీజీ ఆశ్రమం ఈనెల 13 నుండి బాలిక కనిపించడం లేదని పూర్ణానంద సరస్వతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆశ్రమ భూములను కాజేయాలని కొందరు చూస్తున్నారని, అందులో భాగంగానే ఈ కుట్ర జరిగిందని పోలీసుల అదుపులో ఉన్న స్వామీజీ చెప్తున్నారు. దీనిపై తాను కోర్టులో న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
Next Story