Thu Dec 19 2024 13:07:55 GMT+0000 (Coordinated Universal Time)
Drugs : 230 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. బడా స్మగ్లర్ల అరెస్ట్
గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 230 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది.
గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 230 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్కాడ్ తో కలసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ డ్రగ్స్ ర్యాకెట్ కు చెక్ పెట్టింది. గుజరాత్, రాజస్థాన్ లో కలసి చేసిన ఆపరేషన్ లో పెద్దయెత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు దాడులు చేసి డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
పదమూడు మందిని...
ఈ కేసులో మొత్తం పదమూడు మందిని అరెస్ట్ చేశారు. ఏకకాలంలో దాడులు చేయడంతో అటు నిందితులతో పాటు ఇటు పెద్దమొత్తంలో డ్రగ్స్ స్వాధీనం అయ్యాయి. అహ్మాదాబాద్ కు చెందిన మనోహర్ లాల్ ఎనాని, రాజస్థాన్ కు చెందిన కుల్దీప్ సింగ్ లు ఈ డ్రగ్స్ ర్యాకెట్ ను నడుపుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story